“బీజేపీకి మద్దతే కానీ రేపిస్టులకు కాదు: రష్మీ గౌతమ్ ఫైర్”

0
7

బండి భగీరథ్ పోక్సో కేసుపై స్పందిస్తూ సంచలన పోస్టు చేశారు. తాను బీజేపీకి మద్దతుదారినే కానీ రేపిస్టులు, లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదని స్పష్టం చేశారు. సమస్యలపై సానుభూతి చూపగలనని, కానీ పోరాడేంత శక్తి తనకు లేదన్నారు.

తనను ట్యాగ్ చేసి దూషించడం వల్ల ప్రయోజనం లేదని, ప్రభుత్వ అధికారులు, న్యాయవ్యవస్థను ట్యాగ్ చేసి న్యాయం కోరాలని సూచించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల మాత్రమే మార్పు రాదని పేర్కొన్నారు. నటీనటులను ట్యాగ్ చేయడం ఫ్యాషన్‌గా మారిందని, దానివల్ల ఉపయోగం ఉండదన్నారు. బీజేపీ సపోర్టర్ కావడంతో ఈ కేసుపై మౌనంగా ఎందుకున్నావని నెటిజన్లు ప్రశ్నించగా రష్మీ ఈ విధంగా స్పందించారు.