పెద్ది సుదర్శన్ రెడ్డి విక్రమ్ ప్రతిష్టాపన|

0
3

ఉద్రిక్తతల నడుమ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠ

 

» గద్దె నిర్మించి పెద్ది విగ్రహాన్ని ఆవిష్కరించిన బిఆర్ఎస్ నాయకులు

 

వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిసింది. విగ్రహం కోసం నిర్మించిన గద్దెను కాంగ్రెస్ నాయకుల కుట్రతో కూల్చివేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గకుండా, ఆ గద్దెను పునర్నిర్మించి మరీ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించారు. అనంతరం వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలకు సేవ చేసిన గొప్ప నేతల స్మారకాలపై ఇలాంటి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి సహా పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.