ఇక బరువు తగ్గొద్దు లోకేశ్.. ప్రధాని మోదీ సరదా సూచన!

0
3

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీకి తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఫిట్‌నెస్‌పై ఆసక్తికర చర్చ జరిగింది. మోదీయే తనకు ఫిట్‌నెస్ స్ఫూర్తి అని లోకేశ్ పేర్కొన్నారు. ఇకపై బరువు తగ్గవద్దని ప్రధాని సరదాగా సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

సమావేశం మొత్తం ఆత్మీయ వాతావరణంలో సాగింది. రామ మందిరంలో ప్రధాని పూజలు నిర్వహించగా, మంగళగిరి చేనేత శాలువాతో లోకేశ్ ప్రధాని మోదీని సత్కరించారు. మోదీ, చంద్రబాబు ఇద్దరూ తనకు మెంటార్లని లోకేశ్ తెలిపారు.