ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూగర్భ జలాల పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 258 గ్రామాల్లో కొత్త బోర్ల తవ్వకాలను నిషేధించింది. భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోవడంతో ఈ చర్యలు చేపట్టింది. అయితే తాగునీటి అవసరాల కోసం చేతి బోర్లకు మినహాయింపు ఇచ్చింది. శ్రీకాకుళం, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో ఈ నిషేధం అమల్లో ఉంటుంది.
ఖరీఫ్ సాగును ముందుగానే ప్రారంభించాలని వ్యవసాయశాఖ రైతులకు సూచించింది. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులు తెలిపారు.










