పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఎగువమల్లెలవారి పల్లెలో ఆదివారం స్నేహితులతో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన వెంకటేశ్ (30) అనే యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు.
స్థానిక గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమారుడైన వెంకటేశ్, స్నేహితులతో కలిసి ఆటలో పాల్గొంటుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి.










