‎“బండి సంజయ్ వ్యాఖ్యలపై దుమారం”

0
4

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బండి భగీరథ్  పోక్సో కేసుపై సంచలన ఆరోపణలు చేశారు. 17 ఏళ్ల మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయలేదని విమర్శించారు. బాధిత కుటుంబంపై ఒత్తిడి తెచ్చి ఫిర్యాదు వివరాలు మార్చాలని ప్రయత్నించారన్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బాధితురాలిపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. భగీరథ్ మరియు అతని స్నేహితులు సోషల్ మీడియాలో యువతులను ట్రాప్ చేస్తున్నారన్నారు. కేసులో నిష్పక్షపాత విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.