నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఇద్దరు డాక్టర్లు ఉన్నా, ఒకరే విధుల్లో ఉంటున్నారని, మరొకరు సరిగా రావడం లేదని ఆయన విమర్శించారు.
వారం రోజులుగా డాక్టర్లు అందుబాటులో లేరని తెలియడంతో, ఎమ్మెల్యే సోమవారం ఆకస్మికంగా ఆసుపత్రిని తనిఖీ చేసి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని హెచ్చరించారు










