ఇప్పుడే అరెస్టు వద్దు.. ఎవరూ మాట్లాడొద్దు!

0
6

బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. కేసులో ఇప్పుడే అరెస్టులు చేయొద్దని, ఎవరూ మాట్లాడొద్దని ముఖ్య నేతల నుంచి ఆదేశాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు చర్యల్లో ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ నేతలు, మహిళా మంత్రులు కూడా ఈ అంశంపై మౌనం పాటిస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. భగీరథ్ ఆచూకీ తెలియదని పోలీసులు చెబుతుండగా, బండి సంజయ్ మాత్రం సాధారణ కార్యక్రమాల్లో పాల్గొనడం విమర్శలకు కారణమైంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.