“హైదరాబాద్‌లో ఆసుపత్రి ప్రారంభానికి మోదీని పిలిచిన మొనగాడు ఎవరు?”

0
8

బండి పార్ధసారధి రెడ్డి ఆధ్వర్యంలోని సాయి సింధు క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హెటెరో గ్రూప్ చైర్మన్ అయిన పార్ధసారధి రెడ్డి, దివంగత సింధూరి జ్ఞాపకార్థం ఈ ఆసుపత్రిని నిర్మించారు.

ఖానామెట్‌లో కేటాయించిన భూములపై రాజకీయ వివాదాలు నెలకొన్నప్పటికీ, అనంతరం లీజు ఖరారైంది. బీఆర్ఎస్ హయాంలో భూముల కేటాయింపు, కాంగ్రెస్ ప్రభుత్వంలో లీజు ఆమోదం, బీజేపీ నేత మోదీ చేత ప్రారంభం జరగడం విశేషంగా మారింది. హెటెరో సంస్థ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆయన, ఫార్మా రంగంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు.