మదనపల్లెలో ఘనంగా హనుమాన్ జయంతి, ప్రముఖుల హాజరు.

0
4

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.

ఈ పూజల్లో తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇంచార్జ్ కందికట్ల జయ, కురబ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లే రెడ్డి ప్రసాద్, జై భీమ్ నాయకులు కోనా భాస్కర్, కట్టా లక్ష్మి నారాయణ, మల్లికార్జున, ప్రకాష్ పాల్గొన్నారు. వీరంతా భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు.