మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పలు ఖాళీ పోస్టుల భర్తీకి అధికారులు మంగళవారం తెలిపారు. ఈనెల 15న తిరుపతిలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. డాక్టర్ పోస్టుకు రూ. 60 వేలు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ ఒకేషనల్ కౌన్సిలర్‌కు రూ. 25 వేలు, వార్డ్ బాయ్‌కు
రూ. 13 వేలు, కౌన్సిలర్/సైకాలజిస్ట్‌కు రూ. 17,500 వేతనం ఇవ్వనున్నారు. పీర్ ఎడ్యుకేటర్, చౌకీదార్స్, హౌస్ కీపింగ్ వర్కర్, యోగా థెరపిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. అర్హత ధ్రువపత్రాలతో అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.









