ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు.

0
6

Andhra Pradesh High Court ప్రధాన న్యాయమూర్తి Justice Lisa Gillకు రాష్ట్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రత కల్పించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఆమె కాన్వాయ్‌కు విజయవాడ నుంచి అమరావతి హైకోర్టు వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రయాణ సమయంలో కాన్వాయ్ ఎక్కడా ఆగకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకోనుంది. జస్టిస్ లీసా గిల్ 2026 ఏప్రిల్ 25న ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.