అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం ఆర్టీసీ బస్సు ఢీకొని గాయపడిన యువకులు యశ్వంత్, సంతోష్‌లను జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేందర్ పరామర్శించారు.
ఆదిత్య కాలేజీలో పరీక్ష రాసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, సంతోష్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.










