నీట్ పేపర్ లీక్ పై ఎస్ ఎఫ్ ఐ ఏఐఎస్ఎఫ్ నిరసనలు.

0
4

మదనపల్లెలో బుధవారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ, నీట్ స్కామ్‌లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌టీఏను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని కోరారు. నీట్ పేపర్ లీక్ వల్ల లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వారు అన్నారు.