ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (APMEF) ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం నిరసన తెలిపారు.
గత సంవత్సరం నవంబర్ 17 నుండి ఈ సంవత్సరం మార్చి 10 వరకు తమకు రావాల్సిన వేతనాలు ఇంకా చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతూ కమిషనర్‌కు మెమోరాండం సమర్పించారు. సమస్య పరిష్కరించకపోతే విధులు బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు.










