పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల నేపథ్యంలో ఇంధన పొదుపు పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపునకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రభుత్వ శాఖల్లోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) లేదా హైబ్రిడ్ పని విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇంధన ఖర్చులను తగ్గించడంతో పాటు, అనవసర ప్రయాణాలను నివారించి పాలనలో సాంకేతికతను పెంచడం దీని ప్రధాన ఉద్దేశం.
ఇంటి నుంచే విధులు నిర్వహించే వీలున్న విభాగాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే దీనిపై విధివిధానాలు రూపొందించి, కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇది అమలైతే ప్రభుత్వ రంగంలో ఈ విధానం తెచ్చిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలవనుంది.










