గిరిజనుల వినూత్న నిర్ణయం అతిక్రమిస్తే “రెండు లక్షలు” జరిమానా!

0
4

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని గిరిజన గ్రామాలు తమ ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకునేందుకు ఒక వినూత్నమైన, కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఆధునికత వైపు మళ్లుతూ తమ మూలాలను మరుస్తున్న ప్రస్తుత తరం గిరిజనులలో మార్పు తీసుకురావడానికి గిరిజన పెద్దలు, నాయకులు ఏకగ్రీవంగా ఒక చారిత్రక తీర్మానాన్ని ఆమోదించారు.గిరిజనుల సాంప్రదాయ శుభకార్యాల్లో ఒకప్పుడు రేల నృత్యం, కొమ్ము నృత్యాలు ప్రధాన ఆకర్షణగా ఉండేవి.

ఈ రోజుల్లో సాంప్రదాయ నృత్యాల స్థానాన్ని ఆధునిక డీజే (DJ) సౌండ్ సిస్టమ్స్, సినిమా డ్యాన్సులు ఆక్రమించాయి. దీనివల్ల గిరిజన విశిష్ట సంస్కృతి, జీవన విధానం పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. గిరిజన సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇకపై ప్రతి ఇంటికి డోలు,కొమ్ములు, శుభకార్యంలో కొమ్ము, రేలా నృత్యాలను తప్పనిసరి చేశారు. నిబంధనలను ఉల్లంఘించి, సాంప్రదాయ నృత్యాలను కాదని డీజేలు పెడితే సదరు కుటుంబానికి ₹2,00,000 (రెండు లక్షల రూపాయలు) జరిమానా విధిస్తామని గిరిజన నాయకులు హెచ్చరించారు.

సాంప్రదాయాల పునరుజ్జీవనంగిరిజన పెద్దలు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని గిరిజనులు తమ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు తొలి మెట్టుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆధునికత ప్రపంచంలో కొట్టుకుపోకుండా, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి గిరిజన సమాజం తీసుకున్న ఈ అడుగు మిగిలిన సమాజాలకు కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నారు.

 

# Yadagiri