ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు

0
6

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అగ్రికల్చర్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సీడ్స్ లైసెన్స్ మంజూరు చేయడానికి మహాలక్ష్మి ట్రేడర్స్ యజమాని రంగన్న గౌడ్ నుండి ఏఈఓ నరసింహులు, మరో వ్యక్తి మోహన్ కలిసి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, బుధవారం నగదు తీసుకుంటుండగా వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో సీఐలు కృష్ణయ్య, రాజు, ప్రభాకర్ పాల్గొని కేసు నమోదు చేశారు.