కవితా నీ నీచ రాజకీయాలు మానుకో..! రాజకీయ డ్రామాలు ఆపాలని హెచ్చరిక

0
6

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజా వరప్రసాద్ టీఆర్ఎస్ అధినేత్రి కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. సంఘటన వెలుగులోకి వచ్చిన ఐదు రోజుల తర్వాత స్పందించడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. మహిళగా బాధితురాలికి మద్దతు ఇవ్వకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.