అన్నమయ్య జిల్లా రేగల్లు పంచాయతీలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం పర్యటించి, రైతు శ్రీకాంత్ రెడ్డి 15 ఎకరాలలో సాగు చేస్తున్న మామిడి తోటను పరిశీలించారు.
మామిడి కాయలకు కట్టిన కవర్లను చూసి దిగుబడి, మార్కెట్ ధరలను ఆరా తీశారు. గుర్రంవారిపల్లి వద్ద ఫీడర్ ఛానల్ పనులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










