ప్రతి శుక్రవారం నాన్ వెహికల్ డే పాటించాలి

0
2

ప్రభుత్వ పిలుపు మేరకు ప్రతి శుక్రవారం ‘నాన్‌-వెహికల్‌ డే’ పాటించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కోరారు. ఇంధన పొదుపు, కాలుష్య నివారణే ధ్యేయంగా ఆయన తన నివాసం నుండి 2వ డివిజన్ వరకు 19 కిలోమీటర్లు సైకిల్‌పై పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తన సొంత నిధులతో రూ. 70 వేల విలువైన తోపుడు బళ్లు, ఇస్త్రీ పెట్టె, గ్రైండర్‌ను ముగ్గురు నిరుపేదలకు స్వయం ఉపాధి కోసం పంపిణీ చేశారు. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో సైకిల్ వాడకం వల్ల ఆరోగ్యం, ఆర్థిక పొదుపు సాధ్యమని ఆయన పేర్కొన్నారు. సేవ ద్వారా రాజకీయం చేయడమే టిడిపి విధానమని స్పష్టం చేశారు.