ప్రమాదపు అంచున ప్రయాణం

0
4

శాయంపేట మండలం నుండి ఆత్మకూరు వరకూ వెళ్ళే ప్రధాన రహదారిపై రోడ్డుపై రైతులు మక్కలు పోయడంతో ప్రమాదాలు జరుగుతుండడంతో అటుగా వెళ్ళే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

గతంలో రాత్రి సమయంలో ఆ యొక్క రహదారి మీదుగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు ఒదిలిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డు ను ఆక్రమించి మక్కలు ఆరబోసారని కానీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని, సంబంధిత అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.