ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం వాగులో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి|

0
166

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని ధనోర గొండుగూడ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆరుబయట ఆడుకుంటూ వెళ్లిన ఆత్రం లక్ష్మి(4) అనే చిన్నారి ప్రమాదవశాత్తు సమీపంలోని వాగులో పడి మృతి చెందింది. బుధవారం ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న పాప.. ఆడుకుంటూ వెళ్లి వాగులో పడిపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో గాలించిన కుటుంబ సభ్యులు, వాగులో అపస్మారక స్థితిలో ఉన్న పాపను గుర్తించి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లెదుటే ఆడుకున్న బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, పిల్లల విషయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.