అన్నమయ్య జిల్లాలో ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో 41 కేంద్రాల్లో 15,957 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9–12, మధ్యాహ్నం 2–5 వరకు జరుగుతాయి.
సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధించబడ్డాయి. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు, తాగునీరు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నంబర్ 9866112750 ను ఏర్పాటు చేశారు.










