Amaravati రాజధాని కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జిలో నిర్మాణ లోపాలు బయటపడ్డాయి.
ఉండవల్లి నుంచి మణిపాల్ వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌లో భాగమైన ఈ వంతెనకు రూ.68 కోట్లు కేటాయించారు. దక్షిణ భాగంలోని స్టీల్ గడ్డర్లు వంకరగా మారడంతో అధికారులు వాటిని తొలగించి తిరిగి నిర్మించాలని నిర్ణయించారు. శ్లాబు వేస్తే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరించడంతో పనులు నిలిపివేశారు. నిర్మాణ లోపాల కారణంగా ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాంట్రాక్ట్ సంస్థ ఎన్‌సీసీ పనులను పునఃసమీక్షిస్తోంది.










