నార్త్ జోన్ అకాడమీలో ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ ట్రైనింగ్

0
4

Andhra Cricket Association ఆధ్వర్యంలో మే 14 నుంచి 17 వరకు Vizianagaramలోని నార్త్ జోన్ అకాడమీలో ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ క్లాస్ నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మాజీ భారత వికెట్ కీపర్ Kiran More హాజరుకానుండటం రాష్ట్ర క్రికెట్ రంగానికి గర్వకారణమని ACA రాష్ట్ర కార్యదర్శి Sana Satish Babu తెలిపారు.

ఈ మాస్టర్ క్లాస్‌లో వికెట్ కీపింగ్ టెక్నిక్స్, ఫిట్‌నెస్, మ్యాచ్ అవగాహనపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ACA సీనియర్, అండర్-23, అండర్-19, అండర్-16 ఆటగాళ్లకు ఇది అరుదైన అవకాశమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ACA కృషి చేస్తోందని తెలిపారు.