భగీరథ్ అరెస్ట్ అవుతారా? రేపు కీలక తీర్పు?

0
3

బాదితురాలు 2021లో రాప్స్ ఫిర్యాదు చేసింది, అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లు అని బండి భగీరథ్ లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్, ఫోన్ కాల్స్‌లో పుట్టిన తేదీలు వేరేలా ఎందుకున్నాయని కోర్టు ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని నిరంజన్ కోరగా దానిపై రేపు తీర్పు వెల్లడిస్తామని HC తెలిపింది.

‎HCలో బండి భగీరథ్ కేసు విచారణ.. వయసుపై ట్విస్ట్?

‎పోక్సో కేసులో బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. బాదితురాలి వయసుపై విచారణలో స్పష్టత లేదని, ఒకే సర్టిఫికేట్‌లో ఒకే రకమైన డేట్ ఆఫ్ బర్త్ ఉందని భగీరథ్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన HC.. బాదితురాలి వయసుపై పోలీసుల రిపోర్ట్‌ను పరిశీలించాలని సూచించింది. మధ్యంతర బెయిల్‌పై శుక్రవారం తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.