కానిస్టేబుల్ రంగారావుకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు.

0
4

అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం. రంగారావు (52) అనారోగ్యంతో మరణించారు. 1992లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా చేరిన ఆయన మూడు దశాబ్దాలకు పైగా సేవలందించారు.

కర్నూలులో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. రిజర్వ్ పోలీసులు గన్ సెల్యూట్‌తో నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ సంతాపం తెలిపి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.