జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం చిలుకూరు మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో యూనియన్ సభ్యత్వ కార్యక్రమాల ను ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో tuwj iju యూనియన్, జాతీయ కార్యవర్గ సభ్యులు కుంజేటి సత్యనారాయణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అన్ని మండలాలలో యూనియన్ సభ్యత్వ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.
రెండు రోజుల్లో యూనియన్ సభ్యత్వం నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని యూనియన్ ప్రతినిధులను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో అక్రిడేషన్లు ఇవ్వాలని కోరారు జర్నలిస్టుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు యూనియన్ అండగా ఉంటుందన్నారు కార్యక్రమంలో ఐజేయు యూనియన్ జిల్లా ప్రతినిధులు మల్లం వెంకటేశ్వర్లు,కొడారు బ్రహ్మం, దొడ్డ శ్రీధర్, ప్రెస్ క్లబ్ సభ్యులు గోవిందా చారి, సిద్దెల శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు.










