చిలుకూరు, గ్రంధాలయాలు విజ్ఞాన కేంద్రాలని ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య అన్నారు. శుక్రవారం చిలుకూరు బాపూజీ శాఖా గ్రంధాలయంలో విద్యావారోత్సవాలలో భాగంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమంను నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంధాలయాల్లో ఉన్న ‘పుస్తకాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి సరవయ్య ఉపాధ్యాయులు కోదండ రామయ్య కైలాసపు వెంకటేశ్వర్లు, డాక్టర్ సజ్జనకుమారి గ్రామ పెద్దలుపి ల్లుట్ల కృష్ణయ్య బోయిళ్ళ శివ తదితరులు పాల్గొన్నారు.










