మదనపల్లి నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీలో శనివారం ఉదయం వాసుదేవ ఇంటి వద్ద ప్రహరీ గోడ కూల్చివేత యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. హైటెన్షన్ లైన్ కింద అక్రమ నిర్మాణం అంటూ సచివాలయ సిబ్బంది జేసీబీతో చేరుకున్నారు. అయితే, ఇది రిజిస్టర్డ్ స్థలమని, పాములు రాకుండా గోడ నిర్మించుకున్నామని బాధిత కుటుంబం తెలిపింది.
గోడ కూలిస్తే జేసీబీ కింద పడుకుంటామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు ఘటనాస్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు.










