నందిగామలో వైసిపి బూత్ కన్వీనర్లకు ఎమ్మెల్సీ దిశ నిర్దేశం

0
1

నందిగామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, జోన్-3 కోఆర్డినేటర్ కందులు రవీంద్రారెడ్డి, స్టేట్ కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి, పరిశీలకులు అవుతు శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నియోజకవర్గంలోని 222 పోలింగ్ కేంద్రాలకు చెందిన బూత్ కన్వీనర్లు, మండల కన్వీనర్లు, బూత్ మేనేజర్లు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న కాలంలో పార్టీ బలోపేతానికి బూత్ కమిటీలు నిర్వహించాల్సిన బాధ్యతలపై నాయకులు దిశానిర్దేశం చేశారు.