పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జేసీబీ

0
2

పుంగనూరు పట్టణంలో శనివారం సాయంత్రం ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని జేసీబీ ఢీకొనడంతో సింగరిగుంట గ్రామానికి చెందిన సంతోష్ (17) అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

 

స్థానికులు వెంటనే స్పందించి అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి .