గుర్రంకొండలోని అతి పురాతనమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యం దీప ధూప నైవేద్యాలు జరిగేలా సహకరించాలని బీజేపీ నాయకులు కోరారు. 5వ శతాబ్దం నాటి ఈ ఆలయ అభివృద్ధికి, నిత్య పూజల నిర్వహణకు అనుమతి కోరుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
రాజులు పరిపాలించిన ఈ ఆలయం ప్రస్తుతం కనీస కైంకర్యాలకు నోచుకోవడం లేదని, దాని అభివృద్ధికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్, ప్రతాప్, రామంజులు, హరి, మహేష్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.










