విజయవాడలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేయాలని, పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలని సూచించారు.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో నగరానికి ఉత్తమ స్థానం సాధించేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా “Check–Clean–Cover” థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, దోమల నివారణ చర్యలపై ప్రజలకు సూచనలు చేశారు.









