చింతూరు మండలం మదుగూరు అటవీ ప్రాంతంలో జనవరి 19న ఓ నవజాత ఆడ శిశువును ఆశా కార్యకర్తలు గుర్తించారు. పురిట్లోనే విడిచిపెట్టబడిన ఆ పాప తీవ్ర చలిలో ప్రాణాపాయ స్థితిలో ఉండగా వెంటనే చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ కోటిరెడ్డి, డాక్టర్ మహేష్ ఆధ్వర్యంలోని వైద్య బృందం అత్యవసర చికిత్స అందించి శిశువును కాపాడింది. వైద్యుల నిరంతర కృషితో పాప పూర్తిగా కోలుకుంది. అనంతరం ఐసీడీఎస్ అధికారుల ద్వారా పాడేరు శిశుగృహానికి సురక్షితంగా తరలించారు. చిన్నారికి పునర్జన్మ ఇచ్చిన వైద్యులు, ఆశా కార్యకర్తలను స్థానికులు అభినందిస్తున్నారు.
# Yadagiri








