రాహుల్ గాంధీ అరెస్ట్‌ను ఖండించిన షేక్ రెడ్డిసాహెబ్|

0
1

రాహుల్ గాంధీ అరెస్ట్, తలకు గాయం ఘటనపై బీజేపీపై కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ ఘాటు విమర్శలు

 

మదనపల్లె: నీట్ (NEET) పేపర్ లీక్ అంశంపై విద్యార్థులకు మద్దతుగా ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఈ సందర్భంగా ఆయన తలకు గాయమవడం అత్యంత దురదృష్టకరమని మదనపల్లె నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ రెడ్డి సాహెబ్ అన్నారు. విద్యార్థుల సమస్యలను లేవనెత్తిన ప్రతిపక్ష నేతపై పోలీసులు బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

 

దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, ప్రజల గొంతును అణచివేసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

 

రాహుల్ గాంధీకి తలకు గాయం కావడం అత్యంత బాధాకరమని పేర్కొన్న షేక్ రెడ్డి సాహెబ్, ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.