ఆంధ్రా అంగన్వాడీలో విద్యా విప్లవానికి శ్రీకారం

0
4

అచ్చ ప్రాజెక్టుతో అంగన్‌వాడీల్లో విద్యా విప్లవం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారుల కోసం ఉద్దేశించిన ‘అచ్చ’ (ఆంధ్రాలో చిన్నారుల చదువులు) ప్రాజెక్టును మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ. సూర్య కుమారి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలులో అంగన్‌వాడీ కార్యకర్తలే కీలక బలస్తంభాలన్నారు. పిల్లల మానసిక ఎదుగుదలలో తల్లిదండ్రులు మొబైల్స్ పక్కన పెట్టి వారితో సమయం గడపాలని సూచించారు.

6 ఏళ్ల లోపు చిన్నారుల్లో 85% మెదడు అభివృద్ధి చెందుతుందని, అందుకే ఆటపాటల ద్వారా నాణ్యమైన ముందస్తు విద్యను అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లాలోని అంగన్‌వాడీలను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.