విశాఖపట్నం… సముద్రం, కొండలు, పోర్టులు, IT అవకాశాలతో వేగంగా ఎదుగుతున్న నగరం. భవిష్యత్‌లో హైదరాబాద్, బెంగళూరు స్థాయికి చేరుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. పెట్టుబడులు, రియల్ ఎస్టేట్, టూరిజం రంగాల్లో వృద్ధి కనిపిస్తున్నా… ఉద్యోగాలు, మౌలిక వసతులు, ట్రాఫిక్, అంతర్జాతీయ కనెక్టివిటీ వంటి సవాళ్లు ఇంకా ఉన్నాయి. యువతకు అవకాశాలు పెరుగుతున్నాయనే ఆశ ఉన్నా, చాలామంది ఇంకా ఇతర నగరాలకు వలస వెళ్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన ప్రణాళిక, రాజకీయ స్థిరత్వం, భారీ పెట్టుబడులు ఉంటే విశాఖ నిజంగా గ్లోబల్ మెట్రో సిటీగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.










