దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించి, పుణెలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న మనీషా వాఘ్మారేను అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రం తయారీలో పాల్గొన్న ప్రొఫెసర్ మనీషా గురునాథ్‌తో కలిసి ఆమె ఈ లీకేజీ పథకం రచించినట్లు సీబీఐ అనుమానిస్తోంది.
అలాగే, సెల్‌ఫోన్ ద్వారా నీట్ ప్రశ్నాపత్రం లీక్ చేసిన లాతూర్‌కు చెందిన కెమిస్ట్రీ క్లాసెస్ వ్యవస్థాపకుడు శివరాజ్ మొటెగంకర్‌ను (రఘునాథ్) కూడా అదుపులోకి తీసుకున్నారు. తాజా అరెస్టులతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 10కి చేరింది.





