ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బిజెపి నాయకులు

0
4

ఎమ్మిగనూరు బీజేపీ పట్టణ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు వి.జి.ఎ. దయాసాగర్ మాట్లాడారు. నందవరం మండల బీజేపీ నాయకులు గురురాజు దేశాయి వ్యక్తిగత, వ్యాపార విషయాలపై కొందరు టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సరికాదని, వారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు బి.ఎల్. నారాయణ మాట్లాడుతూ.. కూటమిలో ఉంటూ బీజేపీ నేతలను అవమానించడం తగదన్నారు. నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ, కూటమి ధర్మం కోసమే సమన్వయంతో ఉంటున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు బడేసాబ్, రామ్ చరణ్ తేజ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.