ఏపీలో ఈవీ ఉద్యమం: 16,000 ఇ-సైకిళ్ల పంపిణీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ఉద్యమంగా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలి దశలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బందికి 16,000 ఎలక్ట్రిక్ సైకిళ్లను ఈఎంఐ పద్ధతిలో అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
ఈవీ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. సామాన్యులకు సులభంగా రుణాలు అందించేందుకు ప్రత్యేక ఎస్పీవీ (SPV) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేస్తూ, పర్యావరణ హిత రవాణాకు ప్రాధాన్యతనిస్తామని వెల్లడించారు.










