కూకట్‌పల్లి అభివృద్ధిపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే మాధవరం భేటీ!

0
6

మేడ్చల్ కలెక్టరేట్‌లో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో జరిగిన సమావేశంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గ సమస్యలను లేవనెత్తారు. గత ప్రభుత్వంలో ప్రారంభమై, ప్రస్తుతం నిలిచిపోయిన కేపీహెచ్‌బీ ఎన్టీఆర్ స్కూల్ నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీకి అప్పగించి పూర్తి చేయాలన్నారు; అవసరమైతే సొంత నిధులిస్తానని ప్రకటించారు. ఫతేనగర్ అమృత తండా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పేదలకు వెంటనే కేటాయించాలని కోరారు. ప్రశాంత్ నగర్ హెల్త్ సెంటర్, కేపీహెచ్‌బీ 100 పడకల ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేసి, కూకట్‌పల్లి అభివృద్ధికి సహకరించాలని అధికారులను, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.