కూకట్‌పల్లి అభివృద్ధిపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే మాధవరం భేటీ!

0
6

మేడ్చల్ కలెక్టరేట్‌లో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గ సమస్యలను లేవనెత్తారు. కేపీహెచ్‌బీలోని ఎన్టీఆర్ స్కూల్ పనులను వెంటనే జీహెచ్‌ఎంసీకి అప్పగించి పూర్తి చేయాలని, అవసరమైతే సొంత నిధులు ఇస్తానని పేర్కొన్నారు. ఫతేనగర్ అమృత తండా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పేదలకు కేటాయించాలని కోరారు. ప్రశాంత్ నగర్ హెల్త్ సెంటర్, కేపీహెచ్‌బీ 100 పడకల ఆసుపత్రి నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేసి, కూకట్‌పల్లి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.