మత్స్యకారుల సేవలో సీఎం చంద్రబాబు.. నేడు కావలి తుమ్మలపెంట పర్యటన!
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని తుమ్మలపెంటలో నిర్వహించనున్న ‘మత్స్యకార సేవలో’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల పైచిలుకు మత్స్యకార కుటుంబాలకు రూ. 262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఈ సందర్భంగా ఆయన బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఉదయం 10:30 గంటలకు తుమ్మలపెంట చేరుకోనున్న సీఎం.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం మత్స్యకార కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించి, మధ్యాహ్నం టీడీపీ శ్రేణులతో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం ముగించుకుని సాయంత్రం తిరిగి అమరావతికి పయనమవుతారు.
.










