40 వేల మంది ఉద్యోగులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్: పారదర్శక పాలనకు పిలుపు!
సంక్షేమం, సుపరిపాలనే ధ్యేయంగా కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో కలిపి సుమారు 40 వేల మందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి ఉద్యోగులతో నేరుగా మాట్లాడి వారి సూచనలను స్వీకరించారు.
రాష్ట్రానికి గూగుల్, ఆమ్కా (AMCA) వంటి భారీ పెట్టుబడులు వచ్చాయని, సమష్టి కృషితోనే ఏపీకి ‘బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కిందని సీఎం పేర్కొన్నారు. పాలనలో అవినీతి లేకుండా, వేసవి తాగునీటి సమస్యలు రాకుండా ప్రజల అర్జీలను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
.










