అధికారుల పర్యవేక్షణలో ధాన్యం, మక్కజొన్నల పకడ్బందీ కొనుగోళ్లు

0
2

మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ధాన్యం, మక్కజొన్న కొనుగోళ్లు, రవాణా పకడ్బందీగా సాగుతున్నాయని కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 16,059 మంది రైతుల నుండి రికార్డు స్థాయిలో 82,363 మెట్రిక్ టన్నుల మక్కజొన్నలు, అలాగే 13,434 మంది రైతుల నుండి 89,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వివరించారు.

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు రవాణా కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. రానున్న వారం రోజుల్లో కొనుగోళ్ల లక్ష్యాన్ని పూర్తిగా పూర్తి చేస్తామని ఆమె పేర్కొన్నారు.