మత్స్యకారుడి ఇంట్లో చంద్రబాబు భోజనం

0
2

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు తుమ్మలపెంట గ్రామంలోని మత్స్యకారులతో సరదాగా గడిపారు. అక్కడ ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక మార్కెట్‌లో స్వయంగా చేపలు కొనుగోలు చేశారు. ఆపై మత్స్యకారుడు తానంగారి బాబు ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లారు. బాబు భార్య వెంకమ్మ చేపల పులుసు వండుతుండగా, చంద్రబాబు స్వయంగా గరిటె తిప్పారు. వంట పూర్తయిన తర్వాత అందరితో కలిసి కింద కూర్చుని భోజనం చేస్తూ, తన చేతులతో వారికి వడ్డించారు. ముఖ్యమంత్రి తమ ఇంటికి వచ్చి సాధారణ వ్యక్తిలా గడపడంతో మత్స్యకార కుటుంబం ఆనందంతో పొంగిపోయింది.