“మైనంపల్లి విరాళంతో అల్వాల్‌లో ఇందిరా గాంధీ కొత్త విగ్రహం”

0
18

మేడ్చల్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్ ప్రధాన రహదారిపై ఉన్న ఇందిరా గాంధీ విగ్రహాన్ని మార్చాలంటూ మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, ఐఏఎస్ కి కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.

ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని అదే సర్కిల్‌లో ఉంచుతూ, రోడ్డుకు సరిగ్గా మధ్యలోకి వచ్చేలా (సెంటరింగ్) పునఃప్రతిష్ఠించాలని వారు కోరారు.

ప్రజల, కాంగ్రెస్ పార్టీ అల్వాల్ సర్కిల్ కమిటీ ఆకాంక్షల మేరకు ఈ వినతిని అందించారు.

ఈ ప్రతిష్ఠాపన కోసం  మైనంపల్లి హనుమంతరావు సొంత ఖర్చులతో ఒక సరికొత్త రాతి విగ్రహాన్ని విరాళంగా అందజేస్తున్నారు.

వినతిపత్రం అందుకున్న జోనల్ కమిషనర్ స్వయంగా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మల్కాజిగిరి ఇన్‌ఛార్జ్ శ్రీ లక్ష్మీకాంత్ రెడ్డితో పాటు అశోక్ రెడ్డి, చంద్రశేఖర్, సురేందర్ రెడ్డి, కేబుల్ శేఖర్, ఉదయ్, సూర్యకిరణ్, సంజీవ్ గౌడ్, సంజీవ, శివ, రాజ నరసింహారెడ్డి, కిట్టు రెడ్డి, సాయిరామ్ గౌడ్, నాగేశ్వరరావు, శ్రీనివాస్ గౌడ్, రాజు యాదవ్, ఇషాక్ ఖాన్, అక్రమ్, బల్వంత్ రెడ్డి, కృష్ణ గౌడ్, విష్ణు, శశికళ, శకుంతల నాయుడు, అరుణ, మేరీ, గాయత్రి, లక్ష్మి, రాందేవి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal