తల్లిదండ్రులే దైవం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

0
1

యువత తల్లిదండ్రులను గౌరవిస్తూ, క్రమశిక్షణతో ఉంటేనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గ విద్యార్థి విభాగ సమీక్షలో ఆయన మాట్లాడుతూ, తాను సామాన్య కార్మికుడి నుండి ఈ స్థాయికి ఎదిగానని గుర్తుచేశారు. BRS పార్టీ ఎల్లప్పుడూ యువతకు అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తూ, 11 వేల మందికి సొంత నిధులతో విద్యా కిట్లు అందించినట్లు తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఈ నెల 25న జరిగే BRS కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.